Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని మేడారంలో సమ్మక్క -సారలమ్మ వనదేవతలను ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య శుక్రవారం దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు, ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సాలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, తాసిల్దార్ సురేష్, ప్రోటోకాల్ అధికారి బొప్ప సమ్మయ్య, ఎం ఆర్ ఐ సునీల్, సమ్మక్క పూజారి సిద్ధబోయిన మునిందర్, కొక్కెర కృష్ణయ్య, కాక సారయ్య పూజార్లు ఎండోమెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.