Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
తాసిల్దార్ నిర్ణయం తీసుకుని 24 గంటలు గడవక ముందే ఆ నిర్ణయాన్ని జెసిబి ట్రాక్టర్ యజమానులు బేఖాతర్ చేస్తున్నారు. శుక్రవారం జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా దుబ్బను తరలిస్తూ నవత ెలంగాణ కెమెరాలకు చిక్కారు. అంతకుముందు రోజు తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ అల్లం రాజకుమార్ జేసీబీ, ట్రాక్టర్ల యజమాను లను పిలిపించి అనుమతి లేకుండా మట్టి మొరము తరలించవద్దని సూచించారు. తప్పనిస రిగా అనుమతి తీసుకోవాలని, లేనట్లయితే చట్టరీ త్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్ణయం ప్రకటించి 24 గంటలు కాకముందే జెసిబి ట్రాక్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా మట్టిని తరలి స్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ శాఖ నిఘా పెంచి పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవాలని సాధారణ పౌరులు సూచిస్తున్నారు.