Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
సీఎం కేసీఆర్ పాలనలో పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్న ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం ఎమ్మెల్యే రాజయ్య కల్పిస్తున్నట్లు జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో శుక్రవారం మండల బీఆర్ఎస్ మహిళా విభాగం మండల ప్రచార కార్యదర్శి వడ్లూరి మౌనిక జన్మదిన వేడుకలు ఆపార్టీ నాయకుల ఆ ధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడు కుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ నిర్ణయా లకు కట్టుబడి పార్టీ పదవులు అందిస్తున్నారని అన్నారు. పార్టీ కోసం కష్టపడే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, న్యాయం చేయడంలో ఎమ్మెల్యే గొప్ప మనసున్న నాయకుడని అన్నారు. ఇందులో భాగంగా మహిళలను తగు గౌరవం ఇస్తూ, ప్రోత్సహిస్తూ, నమ్మిన వారిని వమ్ము చేయకుండా పార్టీ పదవులు కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఏఎంసి డైరెక్టర్ చిగురు సరిత, మహిళా విభాగం పార్టీ నాయకులు నాగపురి పావని, కుందూరి జ్యోతి రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.