Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో పాత ఎర్ర చెరువు గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా దేవేందర్ హాజరై మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అట్టడుగు వర్గాల మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు సాధించిందని గుర్తు చేశారు. దేశంలో నాటి కటుబాట్లను బ్రాహ్మణవాద సంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా 1848 మే 12న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పా ఠశాల ప్రారంభించిందన్నారు. నాలుగు సంవత్సరాల లోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించిందన్నారు. మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవ మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించిందన్నారు. అగ్రవర్ణ దురహంకరణపు కుల నిచ్చనమేట్ల వ్యవస్తను బాల్యవివాహాలకు మూఢ నమ్మకాలు, సతీసహ గమనానికి తదితర వాటికి వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. నేడు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకు హత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, నేటి కేంద్ర ప్రభుత్వం స్త్రీలకు విద్య హక్కు అవసరం లేదని మనువాదం బోధిస్తున్నదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ వంటి సంస్థలు మనువాదాన్ని పెంచిపోషిస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కళ్యాణి, శివాని, భాగ్య, స్రవంతి ,లావణ్య, నీలిమ, సుజాత, వసుంధర ,శ్రీధర్ ,డివైఎఫ్ఐ నాయకులు ఆత్కూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలల హక్కుల కోసం పూలే పోరాటం
నవతెలంగాణ-పాలకుర్తి
సమాజంలోని మహిళల విద్యాభివృద్ధితో పాటు హక్కుల సాధన కోసం సావిత్రిబాయి పూలే పోరాటం చేసిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల శేఖర్ అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్నతో కలిసి శేఖర్ మాట్లాడారు. సావిత్రిబాయి పూలేను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళల విద్యాభివద్ధి కోసం కషిచేసిన తొలి తరం మహిళ ఉద్యమకారని సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. నేటికీ మహిళలపై దాడులు అత్యాచారాలు కొనసాగుతున్నాయని, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మనుధర్మాన్ని తీసుకువచ్చి మహిళలను మళ్లీ వంటగదిలకే పరిమితం చేయాలని చూస్తుందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న మహిళల హక్కులు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల నాయకులు కాకర్ల రమేష్, కుమార్, ఉప్పలయ్య, బాబు, సోమన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.