Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ఎమ్మెల్సీ కవితపై బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ ఆధ్వర్యంలో బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్ల నాగిరెడ్డితో కలిసి నవీన్ మాట్లాడారు. బిజేపికి రాష్ట్రంలో రోజు రోజుకీ ఆదరణ తగ్గడం తట్టుకోలేక బండి సంజరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా డని విమర్శించారు. హద్దు మీరి మాట్లాడే ముందు బండి సంజరు ఇంట్లో మహిళలు ఉన్న విషయం మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సష్టించడమే బండి సంజరుకి ఉన్న పని అన్నారు. బండి సంజరు వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. జిల్లా ఫ్లోర్ లీడర్ పుషఉ్కరి శ్రీనివాసరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ వీరమనేని యాకాంతరావు, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, బీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు మాధవి పాల్గొన్నారు.
రాయపర్తి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత బండి సంజరు వ్యాఖ్యలు సరికాదని మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్ అన్నారు. ఆదివారం బండి సంజరు మాటలను ఖండిస్తూ పార్టీ కార్యకర్తలు వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, మండల రైతు బందు అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ లక్ష్మి నారాయణ, మహిళా నాయకులు కాంచనపల్లి వనజ రాణి, మండల ఉపాధ్యక్షులు సిరికొండ నవల, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు బిల్లా సుభాష్ రెడ్డి, ఐత రాంచందర్, మండల యూత్ అధ్యక్షుడు ముత్తడి సాగర్ రెడ్డి, సర్పంచులు నలామాష సారయ్య, కుక్కల భాస్కర్, బధ్రు నాయక్, ఎంపీటీసీ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
నడికూడ: జాగతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బీజేపీ నేత బండి సంజరు వ్యాఖ్యలకు నిరసనగా నడికూడ బీఅర్ఎస్ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
పర్వతగిరి : పర్వతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షతన ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజరు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంజరు వ్యాఖ్యలు మహిళల పట్ల బీజేపీ ైఖరిని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. సర్పంచ్ చింతపట్ల మాలతి సోమేశ్వరరావు, జడ్పీ కో ఆప్షన్ ఎండి సర్వర్, ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్, ఉప సర్పంచ్ రంగు జనార్దన్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు బరిగల విజయ, మాజీ సర్పంచ్ వేల్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర: ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకుమార్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కేసులతో బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై సంజరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజరు కుమార్, సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, సలిదండి సుధాకర్, మండల మహిళా సెల్ అధ్యక్షురాలు బొమ్మినేని రజిత, బోనగిరి లింగమూర్తి, రెడ్డబోయిన గంగాధర్, అనపురం రవి, సుంకరి అంజయ్య, జాటోత్ వెంకన్న పాల్గొన్నారు.
తొర్రూరు : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆదివారం తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజరు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు ఎస్కే రేష్మ, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు గుగులోతు యశోద మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిలర్లు తూర్పాటి సంగీత ,కర్నే నాగజ్యోతి, సర్పంచ్ బానోత్ యాకమ్మ, ఎంపీటీసీ పల్లె దేవమ్మ, మాడుగుల పూలమ్మ, తొర్రూర్ మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, బిందు శ్రీనివాస్ ,ఎంపీపీ అంజయ్య ,జడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళంపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపెళ్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్, కో ఆప్షన్ సభ్యులు అంకుస్,కౌన్సిలర్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.