Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్లి
- నిఖార్సయిన కమ్యూనిస్టు ప్రశాంత్లి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-మహబూబాబాద్
జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సీపీఐ(ఎం) సీనియర్ సభ్యులు తుడుం ప్రశాంత్(45) అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుం బాన్ని అన్ని విధాల ఆదుకుంటామని డోర్నకల్ ఎమ్కెలేమ్య డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం కురవి మండలం నేరడ గ్రామంలో అమరవీరుడు తుడుం ప్రశాంత్ సంస్మరణ సభ సీపీఎం గ్రామ కార్యదర్శి జంగం ఉప్పలయ్య అధ్యక్ష తన జరిగింది. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రశాంత్ కుటుం బాన్ని పరామర్శించారు. ఆయన సతీమణి సుజాత పిల్లలను ఓదార్చారు. ప్రభుత్వం నుండి ఆ కుటుం బానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు సంక్షేమ పథకాల్లో ప్రథమ ప్రాధాన్యతనిచ్చి దిక్కుతోచని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వ నుంచి ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లా డుతూ తుది శ్వాస వరకు కమ్యూనిస్టు సభ్యుడిగా పీడిత ప్రజల పక్షాన నికరంగా నిలబడ్డ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కులాల కతీతంగా కమ్యూనిస్టు ఉద్యమం నేరడ గ్రామంలో అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి పెరిగిందన్నారు ప్రశాంత్ ఆశయ సాధనలో నేటి యువతరం ముం దుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మలేడి కోటయ్య ,కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి డి రామ్మూర్తి మండల నాయకులు షేక్ మల్సూర్ చలగొల్ల మల్లయ్యమాజీ ఎంపీటీసీ కడియం సత్యం కొండ బత్తుల వెంకన్న దుస్స వెంకన్న జక్కుల మల్లయ్య పాటు టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బజ్జీర్ పిచ్చిరెడ్డి తోట లాలయ్య గుగులోత్ రవి దొడ్డ గోవర్ధన్ రెడ్డి గ్రామ సర్పంచ్ గుండోజు శ్రీనివాస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లెపాక మధు, వివిధ ప్రజా సంఘాల నాయకులు దైద భద్రయ్య పోలేపాక వెంకన్న గంగుల శ్రీనివాస్, మడ్డి సత్యమూర్తి పోలేపాక ఎల్లయ్య షేక్ రజియా ప్రశాంత్ సతీమణి సుజాత పిల్లలు పాల్గొన్నారు.