Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గునిగంటి మోహన్
నవతెలంగాణ - చిన్నగూడూరు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 17న జిల్లాలో జరిగే జాత బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గునిగంటి మోహన్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండంరాజుపల్లి గ్రామంలో కందుకూరి సుధాకర్ అధ్యక్షతన జరిగిన గ్రామ శాఖ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమే ఈ జాత ముఖ్య ఉద్దేశం అన్నారు. జాత రథసారధిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పోతినేని సుదర్శన్, అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, మహిళా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రంగారెడ్డి హాజరవుతారని తెలిపారు. 17న వరంగల్లో జాత ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు మేధావులు, ప్రజాతంత్ర వాదులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మల్లయ్య, జక్కుల లింగయ్య, వీరన్న, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.