Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి పిలుపు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద భావజాలాన్ని ఎండ గట్టడానికి మార్చి 17 నుండి మార్చి 28 వరకు జన చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాపితంగా మూడు రూట్లలో బస్సు యాత్రలు జరుగుతున్నాయని, 17న ఉదయం 8-30 గంటలకు హనుమకొండ లోని హయగ్రీవాచారి గ్రౌండ్లో బస్సు యాత్ర రాక సందర్బంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ రాంనగర్ లోని జిల్లా కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజీపీ మోడీ ప్రభుత్వం 2022 నాటికి ఇండ్లు లేని ప్రతి పేదవాడికి పక్క ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ అమలుకు నోచుకోలేదన్నారు హనుమకొండ మహా నగరంలో ఇండ్లు లేని నిరు పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు అన్యా క్రాంతమౌతున్న ప్రభుత్వ భూములను రక్షించి పేదలను సమీకరించి ఇంటి స్థలాల పోరాటం నిర్వ హిస్తున్నామన్నారు. వారికి తక్షణమే పట్టాలిచి, పక్క గహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదపి. దేశ సంపదను తన ఆప్తుడైన అదానికి కట్టపెడుతూ పేద ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. 17న బహిరంగ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, జి.ప్రభాకర్ రెడ్డి, ఎం.చుక్కయ్య, టి.ఉప్పలయ్య, వాంకుడోతు వీరన్న, రాగుల రమేష్, గొడుగు వెంకట్, జి.రాములు, మంద సంపత్, కాడబోయిన లింగయ్య, కంచర్ల కుమార్, తదితనేలే పాల్గొన్నారు.