Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ హామాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది హామాలి కార్మికులు ఉన్నారని వీరి సమస్యలను పరిష్కరిం చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమ య్యాయని హమాలి కార్మికులు ఐక్యంగా వెల్ఫేర్ బోర్డు సాధన కోసం ఉద్యమించాలని ఆల్ హామాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సిఐటి యు కార్యాలయంలో ఆల్ హామాలి వర్కర్స్ యూ నియన్ జిల్లా కమిటీ సమావేశం అపరాధపు రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా వంగూరు రాములు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శిం చారు. హమాలి కార్మికులు శ్రమదోపిడికి గురవుతు న్నారని, అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు భవన నిర్మాణ కార్మికుల వలే హమాలి కార్మికులకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేరళ రాష్ట్రంలో హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఉందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కేరళలో హమాలి కార్మికులకు రూ.16 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రమాద బీమా సౌకర్యం హమాలీలకు లేకపోవడం శోచనీ యమన్నారు. ఈనెల 20వ తేదీన తాసిల్దార్ కా ర్యాలయం ఎదుట రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేప ట్టాలని, ఈనెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. హమాలి కార్మికులంతా పాల్గొనాలని కోరారు హఅమాలి కార్మికులకు ఇండ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన కార్మికులకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు సాధన కోసం ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా జీపు జాత నిర్వహిస్తామని ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 27న చలో హైదరాబాద్ వేలాది మందితో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆల్ హామాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ హమాలి యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల సోమన్న యూనియన్ జిల్లా నాయకులు అన్నేబోయిన రాజు, కడారి ఆంజనేయులు, ఎం రాజు ,బాల నరసయ్య, బాలయ్య ,ఎండి నసీబ్ ,ఏ రాజు తదితరులు పాల్గొన్నారు