Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
రక్తదానం చేయడం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడంతో సమానమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినరు భాస్కర్ అన్నారు. వడ్డేపల్లి ట్యాంక్‌బండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వడ్డేపల్లి ట్యాంక్ బండ్ నందు ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వినరు భాస్కర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్త దానం చేయడం మరొకరికి ప్రాణదానం చేయడంతో సమానమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎలకంటి రాములు, అసోసియేషన్ అధ్యక్షులు అన్నారపు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కైలాస్ చంధ్ అగర్వాల్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.