Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పాలకుర్తి
నిత్యం రద్దీగా ఉండే పాలకుర్తి జనగామ రహదారిపై గుంతలు పడి ప్రమాదాల బారిన వాహనదారులు పడడంతో ప్రమాదాలు జరిగిన ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలో విఫలమ య్యారు. మండలంలోని పాలకుర్తి తొర్రూరు గ్రామాల మధ్య నడి రోడ్డుపై పైపులైన్ లీకేజీ గుంతలు పడడంతో వాటిని మరమ్మత్తు చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నడి రోడ్డు పైనే గుంతలు ఉండటం ఇటీవలే కాలంలో ప్రమాదాలకు గురై పలువురు గాయపడి నారు. రాత్రి వేళల్లో ప్రయాణదారులకు రోడ్లపై పడి ఉన్న గుంతలు యమపాశం గా మారాయి. వ్యవసాయ సాగు కోసం రైతులు వేసుకున్న పైపులైన్లు లీకేజీ రావడంతో రోడ్డుపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోడ్డుపై పడిన గుంతలకు కొం తమంది వ్యక్తులు ప్రమాదాల నివారణ కోసం కంప చెట్లను హెచ్చరిక బోర్డులుగా ఏర్పాటు చేయడంతో వాహనదారులు భయం గుప్పెట్లో వాహనాలను నడుపుచున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణ సమయంలో పైపులైన్లను పట్టిష్టంగా ఉన్నాయో లేదో అని చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు అంటి ముట్టనట్లుగా వ్యవహ రించడంతో పైపులైన్ లీకేజీలతో నడిరోడ్లపైనే గుం తలు ఏర్పడుచున్నాయి. నడి రోడ్డుపై పడిన గుం తలను పూడ్చాల్సిన బాధ్యత ఆర్ అండ్ బి అధికా రులపై ఉన్నప్పటికీ మరమ్మతు చర్యలు చేపట్టకపో వడం గమనహారం. నడి రోడ్డుపై పడిన గుంతలను పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.