Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల, రైతుల, పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తూ తీవ్ర అన్యాయం చేస్తుంది తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య విమర్శిం చారు. ఆదివారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా సంఘాల సదస్సులో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ ప్రతిఘ టించాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ల సంపద విపరీతంగా పెరి గింది. నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి, పేద ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. మోడీ ప్రజా ఓట్లతో గెలిచి కార్పోరేట్లకు జీతగాడిలా పనిచేస్తుండని అన్నారు. ఉపాధి హామీకి బడ్జెట్లో 29 వేల కోట్లు కోత పెట్టి, ఉపాధి హామీ నిర్వీర్యం చేస్తుందని తెలియజేశారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న ఢిల్లీలో కార్మిక, కర్షక, సంఘర్షణ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ, సిఐటియు, రైతు సంఘం, యాతం సమ్మయ్య, వడ్లకొండ సుధాకర్, నక్క యాకయ్య, గుండెబోయిన రాజు, కాట సుధాకర్, ఎండి షబానా, సిద్ధం సోమన్న, ఆకుల సారంగం, మాజీ సర్పంచ్ ఉప్పునూతల మల్లయ్య, అధిక సంఖ్యలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.