Authorization
Mon February 24, 2025 03:50:36 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జిఎస్ఆర్
నవతెలంగాణ-రేగొండ
ఈ నెల 15 నుండి భూపాలపల్లి జిల్లాలో జరిగే హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయా లని భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆది వారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తత సమావేశానికి ముఖ్యఅతిథిగా గండ్ర సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ జిల్లాలో జరిగే హాత్ సే హాత్ జోడో యాత్రకు మండలములోని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కషి చే యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుటోజు కిష్టయ్య, మేకల బిక్షపతి, ఓం ప్రకాష్, భద్రయ్య, కోలేపాక సాంబయ్య రవికుమార్ రవీందర్ సదానందం, బొచ్చు సాంబయ్య, ప్రసంగి, కిరణ్ పటేల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.