Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ విగ్రహాలను ఊరూరా నెలకొల్పాలే
- జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
నవతెలంగాణ-మహాదేవపూర్
అణగారిన వర్గాల కోసం నాడు అనేక త్యాగాలు చేసిన బీఆర్ అంబేద్కర్, జ్యోతీరావుపూలే లాంటి మహనీయుల మార్గంలోనే నడుస్తామని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మహదేవ్పూర్ మం డలం ఎడపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహన్ని ఆదివారం భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్తో కలిసి ప్రారంభించారు. అనంరతం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు తన ఇంట్లో అంబే ద్కర్ సుప్రబాతమే ఉంటుందని అన్నారు. ఎన్ని ఇబ్బం దులు, ఎన్ని కష్టాలు వచ్చినా అంబేద్కర్ ఆశయాలను, పూలే చూపిన మార్గంలో పయనిస్తూ బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి చేస్తానని అన్నారు. నాడు బ్రాహ్మణీయ వ్యవస్థ అంబేద్కర్ను ఒక్క కులానికే పరిమితం చేశారని, ఈనాటికి అనేక ప్రాంతాల్లో ఇదే ఆనవాయితీగా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా వారికే రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లుగా చిత్రీకరించారని అన్నారు. అంబేద్కర్రాజ్యాంగం మూలంగానే ఈనాడు అనేక వర్గాలు పదవులు అనుభ విస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మహాదేవ్పూర్కు చెందిన ఏ ప్రజాప్రతినిధి అయినా కుర్చీలో కూర్చున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగఫలమేనని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. అయితే అంబేద్కర్ రిజర్వేషన్లలో ఎస్సీలకంటే బీసీలకే ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలని, ఈ విష యంపై ప్రతి ఒ క్కరిని మేల్కొల్పాల్సిన బాధ్యత అం దరిపై ఉందన్నారు. అంబేద్కర్ విగ్రహాలను ఊరూరా నెలకొల్పాలని, పండుగ వాతావరణంలో విగ్రహ ఆవిష్కరణలు ఉండాలన్నారు. తన తల్లి, తండ్రి విగ్రహాలు ఎక్కడైనా పెడితే వ్యతిరేకించాలే కానీ అంబేద్కర్, పూలే, కొమురంభీంలాంటి విగ్రహాలను ఆవిష్కరిస్తే సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ఎడపల్లి గ్రామస్తులంతా కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చరిత్రలోనిలుస్తుందని అన్నారు. విగ్రహదాత చేకుర్తి శంకరయ్యను అభినం దించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణిబారు జెడ్పిటిసి గుడాల అరుణ, అన్నారం ఎంపీటీసీ ఎమ్మార్పీఎస్ నాయకులు మంచినీళ్లు దుర్గయ్య, బ్యాంకు చైర్మన్ సల్లా తిరుపతిరెడ్డి, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్లు భాను ప్రకాష్, కుంభం పద్మ, ఎంపీటీస ీరేవల్లి మమత సర్పంచ్ కుమ్మరి చిన్న మల్లయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్, అంబేద్కర్ విగ్ర కమిటీ వేము నూరి జక్కయ్య సభ్యులు, సర్పంచ్ శ్రీపతి బాపు, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ మమత, ఆల్ ఇండియా నేతకాన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గోమాస రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు