Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
మహిళ ఆదిపరాశక్తి ,తాను అనుకుంటే ఎదైనా సాధించగల సత్తా ఉన్న వ్యక్తి, మహిళలకు సహనంతో పాటు ధృడ సంకల్పం ఉంటుందని ములుగు ఎమ్మెల్యే ధనసరి (అనసూయ) సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో సర్వర్ చారిటబుల్ ట్రస్ట్, ఫౌం డేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సర్వర్ ట్రస్ట్, ఫౌండేషన్ చైర్మన్ తస్లీమా మహ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లా డారు. మహిళల అభ్యున్నతి,చట్టాలపై అవగాహన,మహిళల సాధికరత,స్వయం సహాయక రంగాలపై అవగాహన కల్పించడం కోసం అమెరికాలో ఉండే కొంత మంది ఎన్నా రైల సహకారంతో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు తస్లీమా తెలిపారు. అతిధులచే జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సీతక్క హాజరై ప్రసంగించారు. సమాజంలో ప్రతి వంటింటి గహిణి మాత్రమే పదానికి తావులేకుండా సమాజంలో అంద రు సమానమనే అనే విధంగా ప్రతి రంగంలోను రాణిం చాలన్నారు. సమాజంలో సామాజిక,ఆర్థిక,మానసిక ఒత్తిడిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది రచన రెడ్డి మాట్లాడుతూ కుటుంబ పోషణతోపాటు సమాజ అభ్యున్నతికి పాటు పడు తున్న మహిళలను గౌరవించుకోవాలని అన్నారు. రాణి రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుని నాయకత్వ లక్షణాలను అవలంభించుకోవాలని అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరో హించిన మాలవత్ పూర్ణ మాట్లాడుతూ ఆకాశంలో నిన్నటి మాట.. ఆకాశమే తమ వశం కావాలన్నది ఆధునిక మహిళ బాట అన్నారు. ఆ దశలో మహిళలు అన్ని సామాజిక రుగ్మ తలు అధిరోహించాలని అన్నారు. అనంతరం మహిళ కాని స్టేబుల్స్ను శాలువా, మెమొంటోస్ అందించి సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, సిడబ్ల్యుసి చైర్మన్ వసుధ,ప్రీతి దయాళ్, రమాదేవి, వలిబీయా, మహిళ సర్పంచులు, మహిళ సంఘాలు, మహిళలు, సర్వర్ చారిటబుల్ ట్రస్ట్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.