Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అటవీశాఖ అధికారులు
నవతెలంగాణ - తాడ్వాయి
తాడ్వాయి ఏజెన్సీలో ఎక్కడో చిన్నగా లేచిన నిప్పు రవ్వ ఎండిన ఆకులు అంటుకుని అడవులు పూర్తిగా కాలిపోతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం 163వ జాతీయ రహదారి, కొండపర్తి ప్రధాన రహదారి వెంట, తాడ్వాయి టూ కాటాపూర్ అడవి ప్రాంతం లో ఆదివారం అడవులు కాలీ బుగ్గి అయిపోతున్నాయి. ఇంకా అడవులు కాలుతూనే ఉన్నాయి. పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రజలు, వన ప్రేమికులు అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం నీడలో ఉన్న అడవి శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.