Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
పట్టణంలోని ఫాతిమానగర్ లో ఆదివారం ఫాతిమామాత మహౌత్సవాలు కథోలిక మేత్రసనం పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల దివ్యబలి పూజ సమర్పించి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసం గిస్తూ గత 71 ఏళ్లుగా ఫాతిమా మాత ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శాంతియుత జీవనం కోసం ప్రతి ఒక్కరు క్రీస్తుమార్గం అనుసరించాలని కోరారు. కోరిన కోరికలు తీర్చే ఫాతిమా మాత ఆశీస్సులు ప్రజ లందరిపై ఉంటాయన్నారు. యువత సన్మార్గంలో ముందుకెళ్లాలన్నారు, ఉత్సవాలలో భాగంగా స్వస్థత ప్రార్ధనలను నిర్వహించారు.
ఫాతిమా మాత ఊరేగింపు....
చెన్నైకు చెందిన కళాకారులతో తయారు చేయించిన 30 ఫీట్లు గల ప్రత్యేక రధంపై ఫాతిమా మాత విగ్రహాన్ని ఉంచి ఫాతిమా నగర్ పురవీధుల మీదుగా ఊరేగించారు. ఈ ప్రత్యేక రధంను బిషప్ ఉడుముల బాల ప్రత్యేక పూజలు చేసి ప్రారం భించారు. గురువులు, సిస్టర్లు, భక్తులు అధిక సంఖ్యలో రథం వెంటరాగ ఫాతిమామాతను పుర వీధుల మీదుగా రథంపై ఊరేగించి క్యాత్రడల్ చర్చిలోకి తీసుకవెళ్ళారు. క్యాత్రడల్ చర్చి ఆవరణలో ఉన్న ఫాతిమామాత గుహ ఎదుట కోవ్వ్యోత్తులు వెలి గించి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. క్యాథ్రడల్ చర్చి విచారణ ఆధ్వ ర్యంలో రాత్రి జరిగిన భక్తి గీతాలాపాన ఆధ్యాత్మిక సుగాంధలు అందించింది. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు కాసు మర్రెడ్డి, కర్నూలు నేత్రసానం ఫాదర్ జోజి రెడ్డి, లోడి సంస్థ డైరెక్టర్ ఫాదర్ విజయపాల్ రెడ్డి, ఫాదర్ అను కిరణ్, అంతోని, చర్చి కౌన్సిల్ ప్రెసిడెంట్ బొక్క దయాసాగర్, సభ్యులు మత్యాస్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.