Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
నా ఊపిరి ఉన్నంతవరకు మహిళల ఆత్మగౌరవం కోసం కషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని జానకిపురం గ్రామంలో ఇటీవల ఆ గ్రామ సర్పంచ్ కుర్సపల్లి నవ్య ప్రవీణ్ చేసిన వాక్యాలకు,వస్తున్న కథ నాలకు, ఆదివారం ఆ గ్రామంలో పత్రిక సమావేశాన్ని నిర్వహించి ఇరువురు మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య ప్రవీణ్ మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్య ప్రవర్తన చేసిన ఎంతటి వ్యక్తులైన వదిలేది లేదని వారి పైన ఎప్పుడైనా తగిన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేయడం చర్చ గా మారింది. సమాజంలో ఏక్కడ మహిళలకు అన్యా యం జరిగినా ఊరుకునేది లేదని మండిపడ్డారు. మా గ్రామ అభివద్ధి కోసం కుంటూ పడేటట్లు చేసిన నాయకులను, నాయకురాళ్లను ఎన్నటికీ వదిలేది లేదని, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తగిన రీతి లో సమాధానం చెప్పవలసి వస్తుందని బాహటంగా ఆరోపించారు. ఇప్పటివరకు గ్రామంలో 95 లక్షల రూపాయలతో అభివృద్ధి మాత్రమే చేయడం జరిగిం దని దానికి ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ సమావేశం వేదికగా మిగిలిన ఎనిమిది నెలల్లో చేసే పనుల గురించి ఎమ్మెల్యే బాహాటంగా చెప్పవలసిందిగా ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య స్పందిస్తూ ఇప్పటివరకు జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు తెలిపారు. తాను ఏ గ్రామం పట్ల వివక్షత చూపలేదని వివరించారు. రెండు సంవత్స రాల క్రితం జరిగిన పరిణామాలకు ఈరోజు ఈ రకంగా వేదిక కావడం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వపరంగా గ్రామాలు సర్వతో ముఖాభివద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో వివిధ రాజకీయ పరి ణామాల దృష్ట్యా, ఈడీఎస్ నిధులు రాకపోవడం, మన ఊరు మన బడి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. నాకు కుటుంబ రిత్యా నలుగురు అక్కచెల్లెళ్లు నియోజకవర్గంలో మహిళల ఆత్మగౌరవం కోసం వారి అస్తిత్వం కోసం, వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి తప్పకుండా వారికి 24 గంటలు అందు బాటులో ఉండి పనిచేశానని చెప్పారు. నా ఒంట్లో చివరి రక్త బొట్టు, ఊపిరి ఉన్నంతవరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తానని అన్నారు. నేను చేసే పనులలో వారిని ఎక్కడ నైనా వారికి వ్యతిరేకంగా వారి మానసిక స్థితికి, శోభకు గురి చేస్తే, తప్పకుండా తప్పును తప్పుగా ఒప్పుకోవడం ఉంటుం దని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులతో తక్షణమే రూ.25 లక్షలు విడుదల చేస్తున్నానని తెలిపారు. ఈ గ్రామాన్ని ఆదర్శవంత గ్రామముగా తీర్చిదిద్దడానికి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు వార్డ్ నెంబర్లు ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.