Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజలు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో బీఆ ర్ఎస్ జిలా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి నేతత్వంలో జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వ ర్యంలో భూపాలపల్లి రన్ ఎడిషన్ 2 కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 21 కే ,10కె, 5కే రన్ లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డిలతో కలిసి జండా ఊపి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమ ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గఅభివద్ధి కార్యక్రమాలే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా అందరిని అప్రమత్తం చేయడానికే ఈ 2కె రన్ ను నిర్వహించి అవగాహన కల్పిం చడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లతోపాటు, సింగరేణి ,జెన్ కో ఉద్యోగులు కార్యకర్తలు యువతి యువకులు వయసుతో సంబంధం లేకుండా అధిక సంఖ్యలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని వివరించారు.
మానసికల్లాసానికి క్రీడలు : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని ప్రతీ మనిషి వయసుతో సంభందం లేకుండా ప్రతిరోజు ఉద యం పరుగెత్తితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవెష్ మిశ్రా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ 2కె రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మార థన్ 2లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.
జీఎంఆర్ఎం ట్రస్ట్ సేవలు అభినందనీయం
: జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి
జిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే భూపాలపల్లి రన్ 2 ఎడిషన్ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమని ఈ రన్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రన్ టు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి పాల్గొని 5కె రన్ లో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.
పండగను తలపించేలా పరుగుల పోటీలు
నిర్వహిస్తాం : జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
గత సంవత్సరం కూడా ఇదేవిధంగా రన్ భూపాలపల్లి వన్ ప్రారంభించడం జరిగిందని అదేవిధంగా ఈ సంవత్సరం పండగ వాతావరణం లాగా భూపాలపల్లి రన్ టు ఎడిషన్ నిర్వహించడం జరుగుతుందని వరంగల్ జెడ్పి చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. భూపాలపల్లి రన్ టు కార్యక్రమంలో పాల్గొని 21కె పరుగుపందాన్ని నిర్ణయిత టైంలో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
21.1కే కిలోమీటర్ల పరుగులు
విజయవంతంగా పూర్తి చేసిన గండ్ర జ్యోతి...
జిల్లా కేంద్రంలో జిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భూపాలపల్లి రన్ ఎడిషన్ -2 కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మూడు విభాగాలుగా 21కే, 10కే, 5కే పరుగుల పోటీలో 21.1కే పందెంలో ఎంతో చురుగ్గా పాల్గొని దిగ్విజయంగా నిర్ణీత సమయానికి ముందే విజయ వంతంగా పూర్తి చేసింది.గండ్ర జ్యోతి పట్టుదలపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.
విజేతలకు బహుమతులు ...
ఈ రన్2 కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి జిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి, ద్వితీయ, తతీయ బహుమతులను ఎమ్మెల్యే గండ్ర దంపతులు, జిల్లా కలెక్టర్ భవేష్, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పిఎస్ దివాకర, జిఎంఆర్ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ గండ్ర గౌతమ్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జిల్లా యువజన క్రీడల అధికారి బుర్ర సునీత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సామ్యూల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు,వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ కమిషనర్ అవినాష్, కౌన్సిలర్లు శిరూప అనిల్, ముంజాల రవీందర్, జక్కం రవికుమార్ ,నూనె రాజు, మురళి, సమ్మయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, బి ఆర్ఎస్ జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్, రఘుపతిరావు, విద్యాసాగర్ రెడ్డి ,సాంబమూర్తి లతోపాటు వయసుతో సంబంధం లేకుండా సుమారు 1000 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.