Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మహాదేవపూర్ మండలంలోని సుప్రసిద్ధ, పురాతన, చారిత్రక శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి నేడు కొలువుదీరనున్నది. మంథని నియోజకవర్గం బిఆర్ఎస్ నేత, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకు అత్యంత సన్నిహితులుగా పేరున్న అంబటిపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాసరావు దేవస్థానం చైర్మన్గా నేడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ధర్మకర్తలుగా కలికోట దేవేందర్ (మహాదేవపూర్), అడప సమ్మయ్య (కాలేశ్వరం), కుంభం పద్మ (మహదేవపూర్), సిద్ధాంతి భాను ప్రకాష్( మహాదేవపూర్), మెండు వెంకటస్వామి( (మహాముత్తారం), బండి రాజయ్య (మలహర్), ఆరెల్లి సత్యనారాయణ (గోదావరిఖని), అనంతుల రమేష్ బాబు (కాటారం), కామిడి రామ్ రెడ్డి (కాలేశ్వరం),దేవడా శ్యాంసుందర్ (చెన్నూరు), డి. ప్రశాంత్ రెడ్డి (భూపాలపల్లి), శిల్ప రాజయ్య (భూపాలపల్లి), కోరిపల్లి దేవేందర్ రెడ్డి (నిర్మల్ ) గారలు కాలేశ్వరం ముక్తేశ్వర దేవుని సన్నిధిలో మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ అధినాయకుడు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షనుల సమక్షంలో ధర్మకర్తలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంబటిపళ్లి నుండి రెండో ప్రముఖుడిగా లింగంపల్లి శ్రీనివాసరావు చైర్మన్ పదవి పొందడం విశేషం.
ఏర్పాట్లను పరిశీలించిన శ్రీనివాసరావు
కాళేశ్వరం దేవస్థాన ఛైర్మెన్ మరియు పాలక మండలి డైరెక్టర్లు 13న ఉదయం 11.00గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేసి నూతనంగా బాధ్యతలు స్వీకరించనుండగా ఏర్పాట్లను స్వయంగా లింగంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆశీర్వాదంతో,జయశంకర్ జడ్పీ చైర్ ఫర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్ సమక్షంలో జరుగు ఈ ప్రమాణ స్వీకార మహౌత్సవానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట్ల వెంకటేష్ నేత తో పాటు,పార్టీ పెద్దలు రానున్నారని దేవస్థాన ఛైర్మెన్ లింగంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.