Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్
నవతెలంగాణ-ములుగు
గ్రామ పంచాయతీ కార్మికుల 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించా లని ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని, గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా ని ర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్‌కు వినతిపత్రం అందించా రు. ఈ సందర్భంగా దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, గ్రామపంచాయతీవర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షలు ఓరుగంటి రఘు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని తరగతుల ఉద్యోగులకు కొత్త పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచి గ్రామపంచాయతీ ఉద్యోగులకు వేతనాలు పెంచకపోవడం చాలా దారుణమన్నారు. గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్ అనే పేరుతో తీవ్ర పని ఒత్తిడి పెంచి మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధానం వలన నైపుణ్యం లేని పని వలన ట్రాక్టర్ నడిపే వాళ్ళు, ఎలక్ట్రికల్ పనివాళ్ళు చనిపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్న దని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 51 జీవో సవరణ చేయాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని అన్నారు.ఉద్యోగ భద్రత కల్పించాలని కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హౌదా కల్పించాలని, ఎస్క్డే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించా లని ఆదివారం పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పి ఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మి కుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు. కనీస వేతనంతో పాటు నెలలకు సరైన సమయంలో జీతం ఇవ్వకపోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నా రని అన్నారు. జీవో 60 ను అమలు చేసి కనీస వేతనం 26 వేలు, పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇప్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి, ఎండి గఫుర్ పా షా, బిఎస్పి జిల్లా అధ్యక్షులు శనిగరపు నరేష్ కుమార్, ముంజల భిక్షపతి సంఘీ భావం తెలియజేశారు. గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు జిల్లా నాయ కులు సుదర్శన్,జయాకర్, బూడిమే సదయ్య, రజినీకర్ రెడ్డి, బుజ్జిబాబు, నారాయ ణ, రాజు, ఉప్పలయ్య,ఆనంద్, మరియమ్మ, స్వరూప, సాంబయ్య, ప్రమీల, భాస్క ర్, సారయ్య, శ్రీను, సరోజన, మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.