Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
విద్యార్థులు ఎస్ఎస్సీ స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసు కోని అత్యుత్తమ ఫలితాలు సాధించా లని తొర్రూరు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని హై స్కూల్లో కస్తూరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చరణ్ సహకారంతో, తొర్రూర్ మాజీ సర్పంచ్ డాక్టర్ ధరావత్ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా సోమే శ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలో మరింతగా రాణించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించా రు. పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు కోసం సహకారం అందించనున్నట్లు తెలిపారు. మాజీ సర్పంచ్ డాక్టర్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ పేదరికం విద్యకు అడ్డు కావద్దని విద్యార్థులంతా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. పరీక్షలు సమీ పిస్తున్నందున ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదవాలని స్టడీ మెటీరియల్ను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బివి రావు, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు బిజ్జాల మాధవి అనిల్, ధరావత్ సునీత జయసింగ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.