Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న జరిగే సీపీఎం జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి - సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ-వెంకటాపురం
కార్పొరేట్ శక్తులకోసమే పనిచేస్తున్న బీజేపీ విధా నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఐ(ఎం)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ అమీషా నేతృత్వంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. కార్పొ రేట్ శక్తులకు రాయితీలు ప్రకటిస్తూ పెదాలపై భారా లు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పనికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని, ఏటా 200 రోజులు పని దినాలు కల్పించాలని రోజు వారి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని పేదల ప్రజ లు కోరుకుంటుంటే ఉపాధి హామీ పథకాన్ని ఎత్తే సేందుకు సన్నహాలు చేస్తున్నారని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నారన్నారు.మోడీ విధానాల వల్ల దేశంలో ఏటా 12,600 మంది రైతు లు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తుందన్నారు. సిపిఐ(ఎం) అఖి ల భారత కమిటీ పిలుపులో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలో ఈ నెల 19న జరిగే సిపిఎం చైతన్య యాత్రలో జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గ్యానం వాసు, వంకా రాములు,మండల కమిటీ సభ్యులు గుండమల్ల ప్రసాద్, రాంబాబు కట్ల నరసిం హ చారి, చిట్టెం ఆదినారాయణ, కృష్ణ, నరసింహా రావు, మాణిక్యం, శివాజీ, పోషాలు, శ్రీలత, భారతి తదితరులు పాల్గొన్నారు.