Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్
నవతెలంగాణ-ములుగు
పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్ 10వ తరగతి పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటిం గ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణకు చేపట్ట వలసిన పనులను సమీక్షిస్తూ, వచ్చే ఏప్రిల్ 3వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంట ల నుండి 12.30 గంటల వరకు జరిగే పదవ తర గతి పరీక్షలను అధికారులు పరస్పర సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 115 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 21 పరీక్షా కేంద్రాల ద్వారా 3170 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, రెండు ఫ్ల యింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ విద్యార్థులకు ఎలాంటి అసౌక ర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో పరీక్షకు ముందు, తరు వాత పారిశుద్య చర్యలను చేపట్టాలని, టాయిలెట్స్ సరిగా వుండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే నీటి పారుదల శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పోలీసు శాఖ ప్రశ్నా పత్రాల స్టోరేజీ, తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని తెలి పారు. పరీక్ష అనంతరం పరీక్షా పత్రాల తరలింపు ప్రక్రియను పోస్టల్ అధికారులు పకడ్బందీగా నిర్వ హించాలని అన్నారు. పరీక్షలు ప్రారంభమై ముగిసేం త వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వైర్లెస్ సెట్‌తో ఒక అధికారి ఎళ్లవేళలా అందుబాటు లో వుండాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన 2 రూట్లలో ప్రశ్నా పత్రాల పంపిణీ, జవాబు పత్రాలు భద్రపరచు సమయంలో రెవిన్యూ, పోలీసు అధికారుల పర్యవే క్షణ ఉండాలని, పరీక్ష నిర్వహించే రోజులలో పరీక్షా కేంద్రాల వద్ద జీరాక్సు సెంటర్లు మూసివుంచేలా చర్య లు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. వైద్య అధికారులు ప్ర తి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్స్, హెల్త్ కిట్స్ అందుబాటులో వుంచాలని తెలిపారు. ఎలాంటి అసౌ కర్యం కలుగకుండా పరీక్షా సమయానికి విద్యార్థినీ విద్యార్థులు సకాలంలో హజరయ్యేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా అధికారులు ముందస్తు కార్యాచరణతో రూట్ మ్యాపుల ఏర్పాటు ద్వారా సిద్దంగా వుండాలని ఆదే శించారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అంతరాయా లు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా పరీక్షా కేం ద్రాలలో పరీక్షలు పూర్తి అయ్యే వరకు విద్యుత్ సౌక ర్యం ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశిం చారు. పరీక్షల నిర్వహణను చెక్ లిస్టు ప్రణాళికతో దిగ్విజయంగా నిర్వహించాలన్నారు.ఈసమావేశం లో ఆడిషనల్ ఎస్పీఏఆర్ సదానందం, రామమూర్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టల్, డిఈ విద్యుత్ శాఖ నాగేశ్వర రావు, డిఎంటీఎస్ ఆర్టీసి శంకర్, ఏసిజి ఈ జయ దేవ్, డి పిఆర్ఓ రఫీక్, కలెక్టరేట్ సూపర్ ఇండెంట్ రవీందర్, వైద్యశాఖ డెమో అధికారి తిరుపతయ్య సం బంధిత అధికారులు పాల్గొన్నారు.