Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు
- విద్యార్థులకు రవాణా, ఇతర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
- ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
- ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించు ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇం ద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లను, సంభందిత అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ లతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, సంభందిత అధికారులతో వీడి యో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ వైవి గణేష్‌లతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ ఇంటర్ పరీ క్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాం గంప్రత్యేకంగా టెలీమానస్ టోల్‌ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసిందని, పరీక్షల సమయంలో ఆందో ళనకు, టెన్షన్‌కు గురయ్యే విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యు లు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, ఈ సదుపా యం పై విద్యార్థుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అలాగే రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, 040-24601010 నెంబర్ నందు సందేహాల నివృత్తి కోసం సంప్రదించాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహ ణకుగాను 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, తగిన ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోడం జరిగింద ని, సందేహాల నివృత్తి కోసం జిల్లాలో 9059068 004, 9618218719 నంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని, పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రశాంత వాతావరణంలో సజా వుగా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు పని తీరును ముందస్తుగా పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలన్నా రు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఐ ఈఓ వెంకటేశ్వర్లు, డిఎంఅండ్ హెచ్ఓ అప్ప య్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవీందర్, డిఈ విద్యుత్ శాఖ నారాయణా రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ రామ మూర్తి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.