Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
కోతులు కొట్టుకుంటూ విద్యుత్ వైర్ మీద పడ డంతో 11కేవీ విద్యుత్ వై రు తెగిపడి మిగిలిన రెం డు వైర్లపై పడడంతో వి ద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపో యింది. దీంతోవిద్యుత్ స బ్‌స్టేషన్ లో ఎల్టీ ఫ్యూజు లు కొట్టివేయడంతో విద్యు త్ సరఫరా నిలిచిపోయిం ది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరా ల్లోకి వెళితే. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కోతులు కొట్టుకుం టూ విద్యుత్ వైర్‌పై పడటంతో 11 కెవి విద్యుత్ వైరు తెగి మిగిలిన రెండు వైర్లపై పడడంతో ఒక్కసారిగా మంటలు లేచి భారీశబ్దం వచ్చింది. ఎంపీడీవో కార్యా లయం ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో విద్యుత్ స బ్స్టేషన్లో ఎల్టీ ఫ్యూజులు కొట్టివేయడంతో సరఫ రా నిలిచిపోయింది. విద్యుత్ వైరు రోడ్డుపై పడినప్ప టికీ సరఫరా లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలే దు. ఒకేసారి విద్యుత్ వైర్ తెగిపోయి పడిపోవడం, ట్రాన్స్‌ఫాÛర్మర్ పేలిపోయి మంటలు లేవడంతో ప్రజల కు ఏం జరుగుతుందో అర్థంకాక ఆ ప్రదేశాల నుండి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపి వేసి మరమ్మతు పనులు చేపడుతున్నారు.