Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రీతినాయక్ ఆత్మహత్యా ఘటనలో అనుమా నాలు వ్యక్తమవుతున్నాయని వాటిని నివత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉం దని మాజీ మంత్రి జాతీయ బంజారా సేవా సంఘం అధ్యక్షులు అమర్ సింగ్ తిలావత్ డిమాండ్ చేశారు. సోమవారం జాతీయ బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ ప్రీతి నాయక్ మరణం అనేక అనుమానాలకు తావిస్తుందని ఆమెది ఆత్మహత్య కాదని హత్యగానే పరిగణిస్తామని అన్నారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకంచడానికి సంబంధిత అధికారులు కేఎంసి ప్రిన్సిపల్, అనస్థీషియా ఓఎస్డి, ఎంజీఎం సూపర్డెంట్ ముగ్గురు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని వీరిని ముగ్గురిని వెంటనే సస్పెండ్ చేయను డిమాండ్ చేశారు. ప్రీతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిందితుడు సైఫ్ సెల్ ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని కానీ ఆ ఘటనకు కారకులైన అనస్థీషియా ఓఎస్డి సెల్ ను ఎందుకు పోలీసులు స్వాధీనపరచుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ పోలీసులు ప్రీతి ఇది హత్య ఆత్మహత్య ప్రజలకు వివరించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని వెంటనే పోలీసులు ఆమె మరణం పై పూర్తి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోరిక ఈశ్వర్ సింగ్, సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మేనబోయిన సాంబయ్య యాదవ్, అజ్మీర వెంకట్ ,ఎల్ హెచ్ పి ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు లావుద్య శ్రీను నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ కిషన్ నాయక్, బానోతు సునీల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.