Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో పయనించా లని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నా రు. నడికూడ మండల కేంద్రంలో నూతనంగా ఛత్ర పతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రాష్ట్ర రైతు రుణ వియోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్నతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పెర్వాల లింగ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పాటుపడిన ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నా రు. విగ్రహావి ష్కరణ కా ర్యక్రమానికి రావడం సం తోషంగా ఉందన్నారు. శి వాజీ స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి తనతో పాటు ప్రతి ఒక్కరూ కషి చేయా లన్నారు. ప్రజలే ప్రభువు లు గా ఆయన పాలన సాగిందన్నారు. శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్రాష్ట్రాన్ని సాధించడంలో శివా జీని స్ఫూర్తిగా తీసుకున్నారని అన్నారు. రైతుల శిస్తు లు మాఫీకి శివాజీ మహారాజ్ ఎంతో కషిచేశారు. అ దేస్పూర్తితో సిఎం కేసీఆర్ నేడు రైతులకు సిస్తులు లే కుండా చేయడమే కాకుండా పంటపెట్టుబడి అంది స్తున్న ఏకైక సిఎం కేసీఆర్ అన్నారు. అహింసా మా ర్గంలో 14 ఏళుల కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించి అద్భుత పాలన అందిస్తున్నారని తెలిపారు. అభివద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింద న్నారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. సందర్భం గా నాగుర్ల మాట్లాడుతూ ప్రతిఒక్కరూ చత్రపతి శి వాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని అతను ప్రపం చానికే ఆదర్శమని అన్నారు. ప్రతి ఒక్కరూ మహిళల ను గౌరవించాలన్నారు. అలాగే ఆరె కులస్తుల ఓబిసి కోసం ఎమ్మెల్యేతో కలిసి కృషి చేస్తామన్నారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్, జె డ్పీటీసీ సుమలతకరుణాకర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, స్థానిక సర్పం చ్ రవీందర్రావు, అలాగే ఆర సంక్షేమ సంఘం మం డల అధ్యక్షుడు లోకేటి నగేష్, గ్రామ అధ్యక్షులు నగే ష్, రాష్ట్ర నాయకులు కృష్ణాజీరావు, దిగంబర్‌రావు, చందర్రావు, అంజన్‌రావు, రాంబాబు, శివాజీ, వరికల కిషన్‌రావు, ప్రజాప్రతినిధులు, ఆరె కుల సం ఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.