Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని సీఐటీయు జిల్లా నాయకులు హన్మ కొండ శ్రీధర్ అన్నారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదు ట గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధ ర్నా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిది ¸గా హాజరై సీఐటీయూ జిల్లా నాయకులు హన్మకొండ శ్రీధర్ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, గుడెల్లి ఉప్ప లయ్య, అబ్బదాసి అశోక్‌లు పాల్గొని మాట్లాడుతూ కార్మికవర్గం అంతా సంఘటితంగా ఉన్నప్పుడే సమ స్యలు పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్రంలో అన్ని త రగతుల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనా లుపెంచి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు పెంచకపోవడం చాలా దారుణమన్నారు.ఏశాఖలో లే కుండా గ్రామపంచాయ తీ ఉద్యోగ కార్మికులకు మల్టీ పర్పస్ వర్కర్ అనేపేరుతో తీవ్ర పని ఒత్తిడిపెంచి మానసిక వేదనకు గురిచేస్తున్నారన్నారు. ఈ విధానం వలన నైపుణ్యం లేని పని వలన ట్రాక్టర్ న డిపే వాళ్ళు ఎలక్ట్రికల్ పని వాళ్ళు చనిపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని తక్షణమే రా ష్ట్ర ప్రభుత్వం 51జీవో స వరణ చేయాలని మల్టీప ర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కారోబార్, బి ల్ కలెక్టర్లకు ప్రత్యేక హౌదా కల్పించాలని, ఇన్సూ రెన్స్ సౌకర్యం కల్పించాలని ఆదివారం పండుగ సెల వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించ డంలో విఫలమయ్యాయన్నారు. కనీసవేతనంతో పా టు నెలకుసరైన సమయంలో వేతనం ఇవ్వక పోవ డంలో నిర్లక్ష్యం చూపుతున్నారని అన్నారు. జీవో 60 ను అమలు చేసి కార్మికులకు ఇన్సూరెన్స్ పథకాన్ని వెంటనే అ మలు చేయాలని అన్నారు. కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రతతోపాటు పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కారోబార్,బిల్ కలె క్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇప్పించాలన్నారు. ఈ కార్యక్ర మంలోసంఘం నాయకులు జిల్లా నాయకులు ప్రభా కర్, రాజేందర్, పద్మ, మౌనిక, దూడన్న, గోపి, మహా త్మా, భగవాన్‌రెడ్డి, దర్నపెల్లిరాజు, రాంచందర్, ఊ ళ్లేంగల మహేందర్,నిర్మల, తదితరులు పాల్గొన్నారు.