Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
చిరు వ్యాపారుల ఆర్థిక అభివద్ధికి కషి చేస్తానని అదేవిధంగా బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో వెనకాల పట్టణ ప్రజల సౌకర్యార్థం రెండు కోట్ల ఆరు లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ను అదేవిధంగా కోటి 40 లక్షలతో నిర్మించిన నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దివాకర లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టి రామారావు చొరవతో భూపాలపల్లిలో ఉన్న నల్లబంగారాన్ని వెలికి తీసిన నాటి నుంచి కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి నేడు పారిశ్రామిక ప్రాంతంగా దినదినం అభివద్ధిలో దూసుకు పోతుందన్నారు. 130కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిధులు మంజూరయ్యాయని రూ.70 కోట్లతో కుందురుపల్లి నుంచి బాంబుల గడ్డ వరకు రహదారి వెడల్పు, సైడ్ డ్రైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇటీవల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భూపాలపల్లి మున్సిపాలిటీ రూ.50కోట్ల నిధులను మంజూరు చేశారని త్వరలోనే అభివద్ధి పనులకు రూపకల్పన చేసి త్వరలోనే పనులను ప్రారభించుకోవడం జరుగుతుందన్నారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులకు మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1000 క్వార్టర్స్ నిర్మించడం జరిగింది. మళ్ళీ ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మరో 1000 క్వార్టర్స్ ని నిర్మించుకుని ఇటీవలే ప్రారభించుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ ప్రారంభించడం జరిగిందని దీని ద్వారా మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని నాణ్యమైన కూరగాయలను విక్రయించాలని సూచించారు. భూపాలపల్లి అభివద్ధి వైపు పరుగులు పెడుతుంటే ప్రతిపక్ష నాయకులు కళ్ళు లేని వారిలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, మున్సిపల్ కమిషనర్ పి అవినాష్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.