Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భారత జాగతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 45 వ జన్మదిన పురస్కరించుకొని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటారాణిసిద్దు, గ్రంధాలయ చైర్మన్ బుర్ర రమేష్, పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..
భారత జాగతి ఆధ్వర్యంలో వేడుకలు
భారత జాగతి వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని భారత జాగతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలొ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జాగతి నాయకులు చికటి గణేష్ , అభిలాష్ రెడ్డి , సందిప్ గౌడ్ , తుండ్ల గణేష్ , బద్దెల వంశి , సాయికుమార్ , వినరు కుమార్ , రాజ్ కుమార్, వినరు , పవన్ కల్యాణ్ ,వర్మ , శ్రీనివాస్ రెడ్డి, సాయి, శ్రీరాజ్ , రాకేష్ , శ్రీరామ్ , మనొజ్ , కుమార్ , సతిష్ , లతోపాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కాటారం : కాటారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో భారత జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులను, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని , ప్రతి ఒక్క మహిళ వెన్నంటే ఉంటూ రిజర్వేషన్ కల్పించే దిశగా పోరాటం చేసి భారత దేశ అభివద్ధికి ప్రతి ఒక్క మహిళ తోడ్పాటు అందించాలని కోరారు. ఒక మహిళ అనుకుంటే కానీ పని అంటూ లేదని, ప్రతి ఒక్కరు భవిష్యత్తు త్వరలో ఒక ఆదర్శంగా ఉండాలని, ప్రతి ఒక్క మహిళ సాదరికత కోసం కషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మల్లయ్య, దబ్బెట రాజేష్, అర్జయ్యా, పవన్ తదితరులు పాల్గొన్నారు.