Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కు?
- ములుగు జిల్లాకు మట్టిని తరలిస్తున్న వైనం
నవతెలంగాణ గణపురం
సింగరేణి ఓసి త్రీ మట్టిని ములుగు జిల్లాలోని రియల్ ఎస్టేట్ భూములకు తరలిస్తున్నారు. గత వారం రోజులుగా టిప్పర్లను ఏర్పాటు చేసుకొని అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. సింగరేణి ఓసి త్రీ అధికారులు కొండంపల్లి గ్రామానికి చెందిన ఓ భూ నిర్వాసితుడు. అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన ఒకతను. తో కుమ్మక్కై మట్టి దందాను కొనసాగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా టిప్పర్లు ను వెళ్తుర్లపల్లి . అప్పయ్య పల్లి. మీదుగా ములుగు జిల్లా లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అప్పయ్య పల్లి గ్రామం నుండి మట్టి టిప్పర్లు భారీగా పోవడంతో గ్రామంలో దుమ్ము దూళి భారీగా లేవడంతో దానిని కప్పి పుచ్చుకునేందుకు రోడ్డుపై దుమ్ము లేవకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని రోడ్డుమీద చల్లుతున్నారు. ఓసి త్రీ మట్టి నాణ్యత గల మట్టి కావడంతో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఓసి త్రీ మట్టి బయటికి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వని అధికారులు ములుగు జిల్లాకు తరలించేందుకు ఎలా పర్మిషన్ ఇచ్చారనేది ప్రశ్న. మండలంలో సింగరేణి ఓసి త్రీ ఏర్పడింది. మండల ప్రజలకు మట్టి అవసరం నిమిత్తం కావాలని దరఖాస్తులు చేసుకున్న పర్మిషన్ ఇవ్వని అధికారులు భారీ టిప్పర్లకు ఎలా పరిమిషన్ ఇచ్చారని మండల ప్రజలు సింగరేణి ఓసి త్రీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంగా సింగరేణి ఓసి త్రీ అధికారులకు నవతెలంగాణ ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
సింగరేణి ఓ సి త్రీ ముందు ధర్నా చేస్తాం
కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్
సింగరేణి ఓసి త్రీ మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని లేకుంటే ఓసి త్రీ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన కుమార్ యాదవ్ అన్నారు ఆయన నవ తెలంగాణతో మాట్లాడుతూ మండల ప్రజలకు మట్టికావాలంటే ఇవ్వని అధికారులు ములుగు జిల్లాకు ఎలా పర్మిషన్ ఇస్తారని ఆయన మండిపడ్డారు సింగరేణి అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారితో కుమ్మక్కై ఈ దందాను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు అప్పయ్య పల్లి గ్రామంలో ఈ వాహనాలు పోవడం వల్ల దుమ్ము దూళి బాగా లేచి ఇండ్ల మీద పడుతుందన్నారు ఎవరో స్వార్థం కోసం ఈ మట్టి దందాను కొనసాగిస్తున్నారని అది ఆపకుంటే ఓసి త్రీ ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.