Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఆదేశిం చారు. మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రి గుట్ట వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పైపులైన్ ఇంట్రా కనెక్షన్ పనుల ను సోమవారం మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహ న్ రెడ్డి, కమిషనర్ ప్రసన్న రాణి పరిశీలించారు. ఈ సంద ర్భంగా పనులను త్వరగా పూర్తి చేసి పట్టణంలో నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని పలు సూచనలు చేసారు. అనంతరం పాత ఇంటెక్వెల్ను సందర్శించారు. వారి వెంట ఏఈ సు రేష్ , మిషన్ భగీరథ ఇంజనీర్ రాజేష్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.