Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ఇచ్చిన హామీని, జీవో నెంబర్ 58 ప్రకారం నిరుపేదలందరికీ ఇం టి స్థలాల పట్టాలు వెంటనే ఇవ్వాలని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యులు పరికరాల భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తహశీల్దార్ చలమల్ల రాజుకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలు, ప్రస్తుత పరిస్థితుల్లో తాపీ మేస్త్రీల కూడా సరిపోవన్నారు. ప్రభుత్వానికి నిరుపేదలపైచిత్తశుద్ధి ఉంటే ఇంటిని నిర్మా ణం చేయాలని ఆకాంక్ష ఉంటే ఇంటిబంధు ప్రకటించి, ప్రతీఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నీలరవీందర్, జిల్లా కమిటీసభ్యులు ఉస్మాన్, కూసం బుచ్చయ్య, సుమన్, నారాయణ, కుమారస్వామి, పూర్ణచందర్, మొగిలి, రాజు, ఈశ్వరమ్మ, కోమల, స్వరూప పాల్గొన్నారు.