Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
బిజెపి మతోన్మాద విధానాలను ఎండగడుతూ ప్రజా సంక్షేమ మత సామరస్యం ప్రజా స్వామ్యం సామాజిక న్యాయం కోసం పోరాడేం దుకు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఓరుగల్లు నగ రంలో నిర్వహిస్తున్న ప్రారంభ బహి రంగసభ జన చైతన్యయాత్రకు వేలా దిగా తరలివచ్చి విజయ వంతం చేయాలని సిపిఎం గంగసా యిపేట ఏ రియా కమిటీసభ్యులు ధ ర్మారపు సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఈనెల 17న ఆజంజాహిమిల్లు గ్రౌండ్లోజరిగే జన చైతన్యయాత్రకు సంబంధించిన పోస్టర్ ను సిపిఐఎం ఏరియా కమిటీ సభ్యులతో కలిసి బుధవారం బెస్తం చెరువు భూ పోరాట కేంద్రం వద్ద ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు కట్టబె డుతూ ప్రజలపై భారాలను మోపుతుందని 23 కోట్ల మందిని పేదలను చేశారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా రోడ్ల పై తిరిగేలా చేశారని ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టి విధించి ప్రజలను దోచు కున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ఇతర పార్టీ నాయకులపై దాడులుచేయిస్తున్నారని మతోన్మాద విధానాలతో మతసామరాస్యా నికి తూట్లు పొడుస్తున్నారని ఆవేదన చేశారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి ప్రజలపై సారి చేస్తున్న బిజెపి విధానా లపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే జనచైతన్య యాత్ర జరుగుతుందని కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు మాలోత్ ప్రత్యూష, మన్నూరు జ్యోతి, శాఖ కార్యదర్శిలు ఉసిల్ల దీప, కేశబోయిన రాజు, బొక్క చిరంజీవి, వడ్లకొండ జ్యోతి, తాటిపాముల ఉదయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.