Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
మహిళా సాధికారత దిశగా అడుగులు వేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుం దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో పలు క్రీడల్లో పాల్గొన్న 870 మంది మహిళలకు బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం వ్యవసాయ పనుల్లో నిమగమయ్యే మహిళలు క్రీడల్లో సత్తా చాడటం అభినందనీయమన్నారు. అవ కాశం ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతారనడానికి ఈ క్రీడలు రుజువు చేశాయన్నారు.మహిళలు సామాజిక సేవలో కూడ ముందుండాలని సూ చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలన్నీ అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్నామ న్నారు. స్త్రీ శక్తిని పెంపొందించేందుకు కషి చేస్తామన్నారు. ప్రతీ గ్రామంలో మ హిళా సమైక్య నూతన భవనాల నిర్మాణం చేపట్టేందుకు సంబంధించిన ప్రణాళిక సిద్దమైందన్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ మోతె కళావతి పద్మనాభ రెడ్డి, జెడ్పీటీసీ కోమాడ్ల జయ గోపాల్ రెడ్డి , పీఏస్సీఎస్ చైర్మన్ మొరాల మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నామాల సత్యనారాయణ, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, ఏపీఎం మహేందర్, మండల సమాఖ్య సం ఘాలు, క్లస్టర్ బాధ్యులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.