Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
పోరాటాలకు పోరుగడ్డ ఓరుగల్లు, పోరాటాలకు రాజధాని ఖిల్లా, కిలా వరంగల్, అదేనేలపై అవే పోరాటాల స్ఫూర్తితో ఖిలా వరంగల్ మండలం రంగసాయిపేట సీపీఎం కమిటి ఆధ్వ ర్యంలో పేదలు కొనసాగించిన భూ పోరాటాలు యావత్ రాష్ట్రాన్ని ఆకర్షిం చాయి. భూ పోరాటాలకు ముందుండి న డిపిస్తూ సీపీఎం పార్టీ ఆదేశాల మేరకు వరం గల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య సూచ నలతో ఈనెల 17వ తేదీన సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అజం జహి మిల్ గ్రౌండ్లో జన చైతన్యయాత్ర విజయవంతానికి రంగసాయిపేట కమిటీ చేస్తున్న సమా యత్తంపై సీపీఎం రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్తో 'నవ తెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూ..
నవ తెలంగాణ : సీపీఎం పార్టీ తలపెట్టే జనచైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటీ?
సాగర్ : కేంద్రంలోని బిజెపి కార్పొరేట్ అనుకూల ,ప్రజా వ్యతిరేక, మతోన్మాద మనువాద విధానాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకు వెళ్లేందుకు సిపిఐఎం కేంద్ర, రాష్ట్ర నాయకులు పోరుగల్లు అయినా ఓరుగల్లు నగరాన్ని వేదికగా చేసుకొని జనచైతన్య యాత్రను యిక్కడ ప్రారంభిస్తున్నారు. జన చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రంలోని బిజెపి చేస్తున్న దగను ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యం నింపి బిజెపిని తరిమి కొట్టడమే..
నవ తెలంగాణ : చైతన్యయాత్ర విజయవంతనికి రంగసాయిపేట కమిటీ చర్యలు ఏంటి?
సాగర్ : సిపిఎం పార్టీ ఆదేశాల మేరకు మిల్ గ్రౌండ్లో జరిగే జన చైతన్య యాత్ర విజయవంతనికి రంగ సాయి పేట కమిటీ ఆధ్వర్యంలోని అన్ని శాఖల కమిటీ సభ్యుల తో సమావేశాన్ని కొనసాగిస్తున్నాం, గోడ పత్రికలు, కరపత్రాలు, ప్రచార రథాలు, ప్రజలతో సదస్సులు నిర్వహిస్తూ బహిరంగ సభకు వచ్చేలా సమయత్త పరుస్తూ ముందుకు పోతున్నాం.
నవ తెలంగాణ : 17న జరిగే సభ కోసం ఎలా సమాయత్తం అవుతున్నారు?
సాగర్: రంగసాయిపేటలోని ప్రధాన కూడళ్ల తో పాటు భూ పోరాట కేంద్రాలలో సిపిఎం పార్టీ జెండాలతో ఎరుపు వర్ణాన్ని తలపించేలా తోరణాలను కట్టిస్తున్నాం. సుమారుగా 10వేల మందితో ఆర్టీవో జంక్షన్ నుండి జన చైతన్య యాత్ర ప్రారంభ బహిరంగ సభ ప్రాంతం అయినా ఆజం జాహి మిల్ గ్రౌండ్ వరకు ప్రజలతో కలిసి భారీ పాదయాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
నవ తెలంగాణ : సభలో ఎవరు పాల్గొంటారు ?
సాగర్ : జన చైతన్య యాత్రలో ప్రారంభ బహిరంగ సభలో సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరితో పాటు పోలీస్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘ వులు, విజయ రాఘవన్, కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లు ముఖ్య అతిథులతో పాటు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొంటారు.
నవతెలంగాణ : రంగసాయిపేటలో ఏరియాలో సీపీఐ ఎం పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ?
సాగర్ : రంగసాయిపేట ఏరియాలో పేదప్రజలు సిపిఎం పార్టీ వైపు వస్తున్నారని పేదల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని బలంగా నమ్ముతున్నా రని నగరంలో వేల మందికి గూడును కల్పించిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. తొమ్మిదేళ్లుగా గూడు కోసం చూసిన పేదలు పార్టీ ఇచ్చిన భూ పోరాటంలో పాల్గొ ని వేల సంఖ్యలో గుడిసెలు వేసుకొని జీవిస్తుండడంతో పార్టీపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది, భూ పోరాటాలతో పాటు ఉపాధి అసంఘటిత కార్మికులు అంగన్వాడి కార్మికుల సమస్యలపై నలుపెరకుండా పోరాడుతున్నాం, దాంతో ప్రజలు సిపిఎం పార్టీ వైపు చూస్తున్నారు.
నవ తెలంగాణ : సభ విజయవంతనికి మీరు ఇచ్చే సందేశం.
సాగర్ : కార్పొరేట్ల కోసం పనిచేస్తూ పేద ప్రజలను దోచుకునేలా చర్యలు చేస్తూ దేశ ప్రజలను పీడిస్తూ సంక్షేమాలను సబ్సిడీలను క్రమంగా తొలగిస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగాన్ని పెంచి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసి, విద్య, వైద్యన్నీ భారం చేసి పేదల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మతతత్వ విధానాలను ఎండగట్టే జన చైతన్య యాత్ర కు జిల్లాలోని ప్రజలు వేలాదిగా తరలి వచ్చి ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐఎం అగ్ర నాయకులు అందించే విలువైన సందేశాలను ఆలకించి చైతన్యం తెచ్చుకోవాలని కోరుతున్నా...