Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బల్దియ మేయర్ గుండు సుధారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని జిల్లాస్థాయి మహిళ, శిశుసంక్షేమ శాఖ తరపున ఉమెన్స్ డే సెల బ్రేషన్స్ కొత్తవాడ, పద్మశాలి భవన్లో ఘనంగా నిర్వ హించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులం ద రూ జ్యోతి ప్రజ్వలన చేసారు. అంతరం వరంగల్ జి ల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మహిళలలో అ నంతశక్తి దాగిఉందని స్త్రీశిశు సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా ఇతర సమన్వయ శాఖలతో సమన్వయం చేసు కుంటూ జిల్లా అభివద్ధి పథంలో నడిపించాలని అన్నా రు. వరంగల్ నగరమేయర్ గుండు సుధారాణి మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షే మ పథకాలను విని యోగించుకొని సమా జ నిర్మాణంలో కీలక పాత్ర వహించాలని తె లిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా స్థాయి లో వివిధ క్రీడా పో టీలలో గెలుపొం దిన వారికి బహుమతుల ను అందజేశారు. కార్య క్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, స్థానిక కార్పొరేటర్ ఆడెపుస్వప్న,వరంగల్, హనంకొండ జిల్లా సంక్షేమశాఖ అధికారులు శారద, సబిత పాల్గొన్నారు.