Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
గుడిసెలు వేసుకుని జీవనంసాగిస్తున్న పేదలం దరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం హనుమకొండ జిల్లా కన్వీనర్ల చక్రపాణి, రైతు సంఘం కార్యదర్శి ఎం చుక్కయ్యలు పిలుపునిచ్చారు. హనుమకొండ రామ్ నగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో సీపీఎం హను మకొండ వెస్ట్మండల కా ర్యదర్శి వాంకుడోత్ వీరన్న అధ్యక్షతన బుధ వారం జ రిగిన సమావేశానికి వా రు ముఖ్యఅతిథులుగా హా జరై మాట్లాడుతూ ఈనెల 17 నుండి 29 వరకు జన చైతన్య యాత్రను జయప్ర దం చేయాలని కోరారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రజ లు వ్యతిరేకించాలని, గుడ ిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని, మౌలిక సదుపాయాలు అందిం చాలి సామాజిక సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కుక్కముడి రవీందర్, వల్లపు రాజు, బొట్ల స్వామి దాస్, వల్లపు లింగమూర్తి, భూ పోరాట కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు ఏజీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : ఈనెల 17న వరంగల్ జి ల్లాలో సిపిఎం నిర్వహించే జనచైతన్య ప్రచార రథ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఈదునూరి వెంకన్న కోరారు మండలం లోని సాయిరెడ్డిపల్లి, పత్తిపాక, రెడ్లవాడ, తండాల్లో జ నచైతన్య కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పి స్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామా జిక న్యాయం కోసం సిపిఎం అఖిలభారత కమిటీ పి లుపులో భాగంగా వరంగల్ నగరంలోని అజన్ జా హిమిల్గ్రౌండ్ లో జరిగే జన చైతన్య యాత్రలో ప్రజ లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వెంకన్న కోరారు.