Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
రోజురోజుకూ ఎండల తీవ్రత పెరు గుతున్నందున వడదెబ్బకు గురయ్యే అవ కాశం ఉంటుందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు.వేడి గాలులపై గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో సమీక్ష సమా వే శం నిర్వహించారు. ఈ సందర్బంగా కలె క్టర్ మాట్లాడుతూ వేడిగాల్పుల నుండి ప్ర జలు రక్షణ పొందడానికి జాగ్రతలు పా టించేలా వడదెబ్బ లక్షణాలపై ప్రజలకు అవగాహన కలిగించేలా గ్రామాల్లో టామ్ టామ్ వే యించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలతో కూడా చర్చిం చి మరికొన్ని చలివేంద్రాల ఏర్పాటు చేయాలి అని అ న్నారు. ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మం డలాల పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. అ త్యవసరమైతే గాని ప్రజలు ఎవ్వరు బయటకు రావద్ద ని తెలిపారు. మధ్యాహ్నం 12 నుండి 3.30 వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటకు వెళ్లేట ప్పుడు కాటన్దుస్తులనే వాడాలని, ముఖానికి మాస్క్ వేసుకోవాలని, నల్లని దుస్తులు వాడకూడదని స్పష్టం చేసారు. వీలున్నంతవరకు కొబ్బరి నీళ్లు, ఒఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలన్నా రు. వడదెబ్బకుగురైన వారి కోసం పిహె చ్సిల్లో ప్రాథమిక చికిత్స అందించేలా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ వే సవిలో నర్సరీలో మొక్కలు ఎండిపోకుం డా అన్నిచర్యలు తీసుకోవాన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చెవులకు వడ గాలి తగల కుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో తగిన మందులు అం దుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశం లో అద నపు కలెక్టర్ సంధ్యా రాణి, ఆర్ డీ వో వాసు చంద్ర, డీఆర్డీఎ పిడి శ్రీనివాస్ కుమార్ ,డిఎంహెచ్వో సాంబశివరావు, డీపివో జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.