Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఈనెల17న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యు లు బొల్లం అశోక్ పిలుపు నిచ్చారు. బుధవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సీపీఐ(ఎం)పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనచైతన్య యాత్ర గోడపత్రికలు సీపీఐ(ఎం) తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేదలపైన మరింత ధరల భారాలు మోపుతుందని, కేంద్ర ప్రభుత్వం మోడీ, అమి త్ షాల నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలను కట్టబెడు తూ ఉందన్నారు. ప్రజలపై భారాలను మోపుతూ 23 కోట్ల మందిని నిరుపేదలు గా మార్చారని అన్నారు.దేశమంటే అంబానీ,ఆదానిల సొత్తుగా మోడీ మార్చేస్తు న్నారని, బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి వంట నూనెలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్‌తో సహా నిత్యవసర వస్తువుల ధరలు అడ్డు అదు పు లేకుండా పెంచేస్తుందన్నారు. 2014లో 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిం డర్ నేడు 1200 రూపాయలకు పెంచిందన్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల ఒక శాతం ఉన్న కార్పొరేట్ సంస్థల యజమానుల ఖాతాలలో 40 శాతం సంపద పోగు చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం అంబానీ, ఆదాని బడా కార్పోరేట్లకే కొమ్ముకాస్తు, పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుందని ఆయన దుయ్యబట్టారు. బిజెపి ప్ర భుత్వ ఆగడాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎండకట్టెందుకే జనచైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జన చైతన్య యాత్ర మార్చి 17న హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమమై అదే రోజు సాయంత్రం తొ ర్రూర్ మీదుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటుందన్నారు. మాను కోట జిల్లా కేంద్రంలో 17న సాయంత్రం ఐదు గంటలకు వేలాది మందితో జరుగు బహిరంగ సభను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి ఎండి యాకూబ్, ధరావత్ పెద్ద వెంకన్న, ధరావత్ కౌసల్య, దేవుల, ధరావత్ యాకన్న, సుమన్, ప్రవీణ్ పాల్గొన్నారు.
బయ్యారం : ఈ నెల 17న మహబూబాబాద్‌కు సీపీఎం జన చైతన్య యాత్ర రానున్నట్లు జిల్లా కార్యవర్గ సభ్యులు మండ రాజన్న తెలిపారు. బుధవారం మండ ల కేంద్రంలో అప్పయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మండ రాజన్న మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా దేశ, రాష్ట్ర ప్రజల ను చైతన్యం చేయడం కోసం సీపీఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర ఈ నెల 17న ప్రారంభమవుతుందని అదే రోజు సాయంత్రం మన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు వేలాది మందితో జరుగు బహిరంగ సభను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జన చైతన్య యాత్ర పోస్టులను వారు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకు లు మోహన్, పెంటయ్య, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
దంతాలపల్లి : బిజెపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సిపిఐ ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అల్వాల వీరయ్య పిలుపు నిచ్చారు. బుధవారం మం డల కేంద్రంలో జన చైతన్య యాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఈనెల17న బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యాత్రను జయప్రదం చేయాలని కోరారు.దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చి న బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల పై దాడి కొనసాగు తుందని మండిపడ్డారు. దేశంలో ఎన్నికల ముందు ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయ లు ఇస్తామని, జీరో అకౌంట్ తీసుకోమని చెప్పి ఇప్పటివరకు అకౌంట్లో ఒక రూపా యి కూడా ఇవ్వకపోగా నోట్ల రద్దు చేసి 500 మందికి పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ సంస్థలు అమ్ముకుంటూ పోతు నిత్యావసరాల ధరలను మాత్రం రోజు రోజు పెంచుకుంటూ పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బిజెపి ప్రభుత్వం ఇప్ప టికి ఒక ఉద్యోగం ఇవ్వకపోగా కరోనాకాలంలో అనేకమంది కుటుంబాల రోడ్డు మీద పడ్డారని ఒక కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఈ నేపథ్యం లోని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడం కోసం అనేక నిరసన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రం లోని ఈనెల 17వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జన చైతన్య యాత్ర ను ప్రారంభించడం జరుగుతుంది ఈ జనచైతన్య యాత్ర 18వ తేదీన సాయం త్రం 6 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం పార్టీ జిల్లా నాయకులు గునిగంటి మోహన్, మండల కార్యదర్శి బండి శ్రీని వాస్, వీరభద్ర చారి, తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు :ఈనెల17వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిం చబోయే జన చైతన్య యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు అన్నారు. నెల్లికుదురు మం డల కేంద్రంలో స్థానిక విశ్రాంతి భవనంలో చైతన్య యాత్రలో విజయవంతం చే యాలని గోడ పత్రికను ఆవిష్కరించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 17న జరిగే జనచైతన్య యాత్ర విజయ వంతం చేయడానికి మండలంలోని గ్రామాలకు చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొనా లని తెలిపారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను ఎండగట్టడం కోసం జరిగే జన చైతన్య యాత్రను పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు మేధావులు కార్మిక ప్రత్యేక విద్యార్థి యువజన లందరూ పాల్గొని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, సిఐటియు మాజీ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్, కారం రవి, వెంకన్న, సంపత్, కొమురయ్య, వెంకన్న, సైదులు, ఐలయ్య, ముత్తి లింగం, యాకయ్య పాల్గొన్నారు.