Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
దేశీ ప్రోగ్రాం ద్వారా డీలర్లు రైతులకు సాగు ఖ ర్చులు తగ్గించి మేలైన యాజమాన్య పద్ధతులు నేర్పిం చాలని, శిక్షణ తీసుకున్న డీలర్ల అందరిని మహబూ బాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రూనాయక్, కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్ సూచిం చారు. బుధవారం కేసముద్రం స్టేషన్ రైతు వేదిక యందు వ్యవసాయ శాఖ, మేనేజ్ సమితి హైదరా బాద్ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని 40 మంది ఎరువు లు,పురుగుమందుల డీలర్లకు దేశీ ప్రోగ్రాం (డిప్లమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ ) ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి బి.చత్రు నాయక్, మండల ప్రజా పరిషత్ ఛైర్మన్ ఓలం చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ శిక్షణ ద్వారా డీలర్లకు వారానికి ఒక రోజు సంవత్స రంలో 48 వారాలపాటు వ్యవసాయం, అనుబంధ రంగాల మీద ఎరువులు పురుగుమందులు విత్తనాల వాడకంపై పూర్తిస్థాయిలో కెవికె మల్యాల, రీజినల్ అగ్రికల్చర్ స్టేషన్ వరంగల్ వ్యవసాయ శాఖ ఆధ్వ ర్యంలో పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బి.చత్రు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా రిటైర్డ్ ఏడిఏ దుశెట్టి నరేందర్ గౌడ్, ఎంపిపి ఓలం చంద్రమోహన్ మా ట్లాడుతూ శిక్షణలో పాల్గొనే డీలర్లు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో శిక్షణ తరగతులను వినియోగించు కోవాలని కోరారు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమం కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహించడం సం తోషకరమైన విషయం అని శిక్షణలో పాల్గొనే ఇన్పుట్ డీలర్స్ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహా లు సూచనలు పాటించి రైతు సోదరులకు తోడ్పడా లని సాగులో ఖర్చులు తగ్గించి మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగించి రైతులనునష్ట నివా రణ చర్యల నుంచి కాపాడాలని కోరారు. డీలర్లు ఈ యొక్క శిక్షణ తరగతులను పూర్తిస్థాయిలో వినియో గించుకొని ఇటు వ్యవసాయ శాఖకు అటు రైతులకు వారధిలా పనిచేసి రైతులకు మంచి సహాయ సహకా రాలు అందించాలని కోరారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ వివిధ పంటలలో వ చ్చు తెగుళ్లు పురుగులు వాటి నివారణ చర్యలు, వి విధ పంటలలో వాడే కలుపు మందుల మీద మేలైన యాజమాన్య పద్ధతుల మీద శిక్షణ ఇవ్వడం జరి గింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల వ్యవ సాయ అధికారి బి.వెంకన్న, జిల్లా వ్యవసాయ అధికా రి కార్యాలయం సాంకేతిక వ్యవసాయ అధికారి జి.సా రయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు డి.రాజేంద ర్, ఎల్.స్రవంతి, జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఇన్పుట్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు.