Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తస్మాత్ జాగ్రత్త : జిల్లా ఎస్పీ, శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ-మహబూబాబాద్
'కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ'' పేరు తో వాట్సప్ వేదికగా సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడు తున్నారు అని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. వాట్సప్‌లలో తెలియని వ్యక్తుల నుండి మెస్సేజ్‌లు వస్తున్నాయి. అవి 'సైబర్ నేరగాళ్ల' నుండి వస్తున్నాయి. అని తెలుసుకునేలోపే ఫైబర్ మోసం జరిగిపోతుంది అని అన్నారు. మీరు దుబాయి/ముంబై లో నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి లక్కీ డ్రా లో మీయొక్క మొబైల్ నెంబర్ మొదటి బహుమతి గా 25,00,000/- గెల్చుకున్నారు అని మీయొక్క వాట్సన్‌కి మెస్సేజ్ వస్తుంది అని అన్నారు. అదే విధంగా సైబర్ నేరస్తుడు వాట్సప్ నెంబర్‌తో లింక్ పంపించి చాట్ చేయమని చెప్తాడు. మీరు గెల్చుకున్న లాటరీ డబ్బులను తీసుకోవడానికి సర్విస్ టాక్స్ ఇన్ కమ్ టాక్స్ అంటూ కొంత డబ్బులను వాళ్ళు చెప్పిన బ్యాంక్ అక్కౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమంటారు అని తెలిపారు. మీరు డబ్బులు పంపిన వెంటనే ఆ సైబర్ నేర స్తుని మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు అని అన్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి లక్ష్కీ డ్రా పేరుతో అలాంటి సందేశం ఏదైనా వచ్చినట్లయితే జాగ్రత్తగా ఉం డండి అని హెచ్చరించారు.సైబర్ నేరస్తులు వాట్సప్‌లో పంపే కేబీసీ లక్కీ డ్రా లాటరీ మోసాల బారినపడకుండా వుండటానికి మార్గదర్శకాలు పాటించాలని కోరుతున్నాము.మీరు కౌన్ బనేగా కరోడ్ పతి లేదా మీలో ఎవరు కోటిశ్వరులు లాంటి వాటిలో పాల్గొనకుండా ఉండాలని సూచించారు.అలాంటి మెసేజ్‌లు వచ్చి నట్లైతే వాటినిపట్టించుకోకండి. అని ఎస్పీ తెలిపారు. మెసేజ్ లింక్ ఉంటే దానిపై క్లిక్ చేయకండి. సందేశం పంపిన లేదా కాల్ చేసిన వ్యక్తిని బ్లాక్ చేయం డి. తద్వారా మీరు మళ్లీ మోసపోకుండా ఉంటారని తెలిపారు.