Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేత సింగపురం ఇందిర
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నియోజక వర్గంలో రిజర్వాయర్ గుండా పక్క నియోజకవర్గానికి నీళ్ళు తరలిస్తుంటే, అధికార పార్టీ ఇద్దరూ ఉపముఖ్యమంత్రులు చోద్యం చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్య దర్శి, నియోజక వర్గ ఇంచార్జీ సింగపురం ఇం దిర ద్వజమెత్తారు. బుధవారం నియోజక వర్గ కేం ద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఈప్రాంతంలో రైతులు పండించే పంటలకు సాగునీరు అందక అరిగోస పడుతున్నారని వాపోయారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పుణ్యాన రిజర్వాయర్ కింద వందల ఎకరాలకు సాగు నీరు అందించిన ఘనత ఆయనదే అన్నారు. అదీగాక 24గంటలు సాగుకు నిరంతర విద్యుత్ అని, సమయపాలన లేకుండా కోతలు విధించడం వల్ల, పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. తక్షణమే తగిన చర్యలు తీసుకొని ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నీళ్లు రప్పించి, స్థానిక రిజర్వాయర్ నింపి యాసంగి పంటకు సరిపోయే నీళ్లు అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఐక్యం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.