Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
విద్యార్థులు బాల్యం నుండే క్రమశిక్షణను అలవర్చుకో వాలని శ్రీ నలంద పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ అన్నారు. బుధవారం తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ నలంద పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ వేడుకలు నిర్వహించారు.ఈ సం దర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పాలడుగుల రవీందర్ మా ట్లాడుతూ బాల్యం నుండే క్రమశిక్షణతో బంధాలు, బంధు త్వాలను కాపాడుతూ సంప్రదాయబద్ధంగా ఎదుగుతూ సత్ప్రవర్తనతో మెలిగినట్ల యితే విద్యను సులభంగా అభ్యసించవచ్చునన్నారు. ఉదయం లేవగానే మొదట గా తల్లిదండ్రులకు నమస్కరించి వారి మాట తూచా తప్పకుండా పాటించాలని, పిల్లల ఎదుగుదలలో ప్రతి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తారని, సాంప్ర దాయ విలువలను కాపాడుతు ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటూ తమ లక్ష్యాలను చేరు కొని, నేటి సమాజంలో తమ వంతు బాధ్యతగా సమాజ సేవలో పాల్గొని మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాటా ్లడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని ఆనందభాష్పాల తో వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చేతన్, రాంకీ, మహేష్, డి.యాకన్న, అశ్విని, శ్వేతారెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.