Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
వీధి కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని సేవాలా ల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ భూక్య రవి నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సేవాలాల్ సేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుక్కల సమస్య పసి పిల్లలకే కాక, పెద్ద వాళ్ళకి కూడా తీవ్ర సమస్యగా ఏర్పడిందని అన్నారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లా తదితర ప్రాంతాల్లో చిన్నపిల్లల మీద కుక్కల దాడి చేసి ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయా మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు జిఓ రిలీజ్ చేసి వీధి కుక్కలు అన్నిటిని చంపించడమా..? లేదా వీటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సేవాలాల్ రైతు సేన మండల అధ్యక్షులు గుగులోతు నరేష్ నాయక్, జిల్లా నాయకులు లక్ష్మ నాయక్, చిరంజీవి నాయక్, చంద్రు నాయక్, సేవాలాల్ సేన మహిళా నాయకురాలు చిలికి, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.