Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
దేశంలో ప్రధాని మోడీ ఆదానికి దేశ సంపద దోచి పెట్టి అక్రమాలకు పాల్పడిన అంశాలపై, ఆదానీ షేర్ల పతనం, అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని, క్రోని కాపాట లిజంకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆద్వర్యంలో బుధవారం చలో రాజభవన్ కార్య క్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క ను పోలీసులు అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి,విమానయాన సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలను, కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషిస్తున్నదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్య స్తంగా తయారైందనీ, దేశం లో రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు నొక్కే నీచ సంస్కతి బీజేపీదేనని అన్నారు. 2014 లో అధానీ ప్రపంచ కుబేరుల లో 609 వ స్థానం ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడని అన్నారు. మోడీకి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారన్నారు.
ఏటూరునాగారంలో బస్ డిపో, ములుగులో బస్ స్టేషన్ ను అధునికరించండి
ఏటూరునాగారంలో బస్సు డిపో, ములుగు జిల్లా కేంద్రంలో బస్‌స్టేషన్‌ను ఆధునికరిం చాలని హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ఎమ్మెల్యే సీతక్క బుదవారం కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ములుగు జిల్లా వెనుకబడిన ప్రాంతం విస్తరణలో పెద్దదని, అబివృద్ధి లో మాత్రం చిన్నదని అన్నారు. బొగత, లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం,లక్నవరం, సమ్మక్క సారలమ్మ మేడారం జాతర, ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఇలా అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నప్ప టికీ అభివృద్ధిలో వెనుకబాటుకు గురవుతుందన్నారు. రాత్రి 7 గంటలు దాటితే కనీసం హన్మకొండ నుండి ములుగు ప్రాంతానికి బస్ కూడా నడువదన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి అనేక ప్రమాదాలకు గురై చాలా మంది చనిపోతున్నారన్నారు. ములుగు జిల్లా ఏర్పాటు జరిగి 4 యేండ్లు పూర్తి కావస్తున్న నూతన బస్ స్టాండ్ లేదనీ, ఇప్పడు ఉన్న బస్ స్టాండ్ పూర్తిగా శిథిలావస్థలో ఉందన్నారు. ఏటూరునాగారంలో బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆంధ్ర ప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, ఓరిస్సా ఇలా అనేక రాష్ట్రాలకు ప్రయాణం సులువు అవు తుందన్నారు. ఇదేవిషయమై అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా చొరవచూపి మంజూరు చేయాలని కోరారు.