Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ గాష్ ఆలం
నవతెలంగాణ - ములుగు
ములుగు జిల్లాలోని ప్రతి పౌరుని చట్టబద్ధమైన హక్కును కాపాడడం కోసం, పోలీస్ చట్టం పరిధిలోని హక్కులకు విఘాతం కలిగినప్పుడు వాటిని కాపాడడం కోసం, ప్రజల, పోలీస్ సిబ్బంది సమస్యలను తెలు సుకొని దానిని తీర్చడం కోసం ఏర్పాటు చేసిందే ' పోస్ట్ యువర్ ఎస్పి 'ఏ కంప్లైంట్ బాక్స్' అని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. బుధవారం పోస్ట్ యువర్ ఎస్పీ ఏ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ స్వయంగా చేరువయ్యే ఉద్దేశంతో, ప్రజల, పోలీస్ సిబ్బంది కష్టాలను బాధలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం కోసం ఈ ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశామన్న్నారు. ములుగు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలిస్తు వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతున్నామన్నారు. ఎస్పీ అందుబాటులో లేని సమయాలలో కూడా ప్రజలు, పోలీస్ సిబ్బంది నేరుగా కంప్లైంట్ బాక్స్ లో ఫిర్యాదు పత్రాలను వేస్తే పరిష్కరిస్తామన్నారు. పోలీస్ అధి కారులు ఎవరైనా లంచం అడిగినా, ఇతర వేధింపులకు పాల్పడినా కార్యాలయంలో ఎస్పీని నేరుగా సంప్రదిం చవచ్చునని అన్నారు. అలాంటి సిబ్బంది అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ ఫిర్యాదులను రాసి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ (ములుగు పోలీసుస్టేషన్ వెనకాల)లో గాని, జిల్లా ఎస్పీ కార్యాలయం (పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా )ఆవరణలో ఉన్న ఫిర్యాదుల పెట్టెలో గాని ఫిర్యాదులను వేయవచ్చు అన్నారు. వాటిని స్వయంగా ఎస్పీ పరిశీలిస్తారని, ఫిర్యాదుదారుని వ్యక్తిగత, ఇతర వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయన్నారు.