Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
జనగామ పట్టణ అభివృద్దికి అన్ని వర్గాల ప్రజల సహాయ సహాకారాలు అవసరమని, అందరూ సహక రించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన కార్యాల యంలో పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది పనులపై మున్సిపాలిటీ అధి కారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. మార్చి నెలలో పట్టణ పరి ధిలో నల్ల పన్నులు, ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ తదితర పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కేటా యించిన లక్ష్యం చేరే వరకు సిబ్బంది పని చేయాల న్నారు. పట్టణంలో నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కె ట్ల పనులు, వైకుంఠధామాలు, తెలంగాణ క్రీడా ప్రాం గణాలు, పట్టణ సుందరీకరణ పనులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, అంతర్గత రోడ్ల విస్తరణ తదితర అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. తె లంగాణ ప్రభుత్వం చిన్న పట్టణాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. అందులో భాగంగానే పురపాలక సంఘాల బలోపేతానికి అనేక నిధులు కేటాయిస్తూ అభివృద్ది పనులను కొనసాగిస్తుందని తెలిపారు. పట్టణంలో శానిటేషన్ క్రమం తప్పకుండా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమీషనర్ రజిత, డి.ఈ. చంద్రమౌళి, టిపిఒ వీరా స్వామి, ఎ.ఇ.మహిపాల్ తదితర సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.