Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్
నవతెలంగాణ-జనగామ
నర్మెట మండలం వెల్దండ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై విచారణ చేపట్టాలని సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ డిమాండ్ చేశారు. గురు వారం సిపిఎం ఆధ్వర్యంలో వెల్దండ గ్రామ అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలతో కలిసి జనగామ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శివలింగయ్యకు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ లబ్ధిదా రుల ఎంపిక విషయంలో ప్రజాప్రతినిధులు, అధికా రులు అనర్హులకు ఇండ్ల కేటాయింపు చేస్తున్నారని అన్నారు. వెల్దండ గ్రామంలో ఇండ్లులేని నిరుపేదల కు కాకుండా వ్యవసాయ భూములు ట్రాక్టర్లు కలిగిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించడం దారుణం అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపి ణీ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగ లేదన్నారు. నిబంధనలను ఉల్లంఘించి గ్రామసభ జరిపారని అందులో అర్హత లేని వారిని గుర్తించార న్నారు. ఇప్పటికైనా అధికారులు మళ్లీ రీ సర్వే నిర్వ హించి నిజమైన అర్హుల జాబితాని ప్రకటించాలని దాని తర్వాతనే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ నిర్వహించాలని వారు కలెక్టర్‌ను కోరారు.నర్మెట్ట మం డల తహసిల్దార్ శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల కు తొత్తుగా మారి ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ వద్ద అనర్హు లకు ఇండ్ల పట్టాలు ఇండ్ల తాళాలు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పాల్పడమన్నారు. కావున అధికార దుర్వినియోగానికి పాల్పడిన నర్మెట్ట మండల తహసి ల్దార్ శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్హులై న పేదలు రాధిక, కొమురయ్య, సావిత్రి, అనిత, ఏల్ల మ్మ, కళావతి సత్తయ్య, రవి పాల్గొన్నారు.